రాయదుర్గం: ఇరు సామాజిక వర్గాల మద్య గుడి వివాదం నేపథ్యంలో పులకుర్తి గ్రామంలో గ్రామసభ నిర్వహించిన సిఐ వెంకటరమణ
డి.హిరేహాల్ మండలంలోని పులకుర్తి గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య గుడి విషయంలో తగువు వున్న నేపథ్యంలో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో సామరస్యం నెలకొల్పేందుకు ఆదివారం సాయంత్రం గ్రామసభ నిర్వహించారు. గుడి స్థల వివాదం కోర్టు ద్వారా గాని, రెవెన్యూ అధికారుల సమక్షంలోగానీ పరిష్కారం చేసుకోవాలని సిఐ సూచించారు. ఇరు సామాజిక వర్గాలవారు సమ్యమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని హెచ్చరించారు. ఈనెల 23 న ఆర్డీఓ సమక్షంలో పీస్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఇరు సామాజిక వర్గాలవారు ఆ సమావేశానికి హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. హీరేహల్, బొమ్మనహాల్ ఎస్ఐ లు పాల్గొన్నారు.