లోవ అటవీ ప్రాంతంలో ఈనెల 22వ తేదీ నుంచి అమ్మవార్ల అలంకరణలు వాటి వివరాలు ఇవే
కాకినాడజిల్లా లోవా అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు విశేష భరితమైన అలంకరణలో దర్శనమిస్తారని దేవస్థానం ఈవో విశ్వనాథరాజు తెలిపారు. తొలిరోజు సోమవారం బాలత్రిపుర సుందరిగా రెండవ రోజు గాయత్రీ దేవిగా మూడవరోజు అన్నపూర్ణాదేవిగా ఇలా ప్రతిరోజు ఒక అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వడంతో పాటు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణతో అవతరణలు ముగిస్తాయని ఈవో తెలిపారు