పేద కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చడం తగదని సీఐటీయూ నాయకులు విమర్శించారు. బుధవారం కోవెలకుంట్ల, బనగానపల్లెలో ఉపాధి హామీ పథకం పేరు మార్పు, నిబంధనల సడలింపుపై నిరసన వ్యక్తం చేస్తూ జీవో ప్రతులను తగలబెట్టారు. నాయకులు సుబ్బయ్య, బషీర్, బాలరాజు, సుబ్బరాయుడు, నారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.