హిమాయత్ నగర్: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని భారీగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం మధ్యాహ్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను సంతోషంగా ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.