ఆదోని: ఆదోనిలో C.C.I అధికారులకు పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి అందజేత
Adoni, Kurnool | Nov 3, 2025 ఆదోనిలో C.C.I అధికారులకు పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి అందజేయడం జరిగిందని సోమవారం రైతు సంఘం నాయకులు తెలిపారు. సిపిఐ పట్టణ మండల కార్యదర్శిలు టి.వీరేష్, కల్లుబావి రాజు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ సహాయ కార్యదర్శి ఎల్లప్ప గార్ల నాయకత్వంలో జరిగిన ధర్నా నిర్వహించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిసిఐ అధికారులకు సమస్యను వివరించారన్నారు.