గద్వాల్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అధికంగా కొనసాగుతున్న ఇన్ఫ్లో
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సోమవారం ఉదయం ఉదయం 36,564 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిన్నటి వరకూ తగ్గిన ఇన్ఫ్లో ఉదయాన్నే పెరిగినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం ఎగువ జూరాల పవర్ హౌస్ నుండి 25,288 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.568 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. అవుట్ ఫ్లో 27,166 క్యూసెక్కులు ఉన్నట్లు చెప్పారు.