భువనగిరి: భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై న్యూ డైమెన్షన్స్ స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లోనా పై వెళుతున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అనాజిపురానికి చెందిన బాలయ్య గౌడ్ గా గుర్తించారు. అతను భువనగిరి వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంతో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు మృతుడు కల్లుగీత కార్మికుడని న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తును చేపట్టారు.