యాత్రి సేవా దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు
విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు తిరుపతి: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న జరగబోయే యాత్రి సేవా దినోత్సవం సందర్భంగా తిరుపతి విమానాశ్రయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమి నాథన్ తెలిపారు. మంగళవారం విమానాశ్రయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు తిలక స్వాగతం, జానపద నృత్యాలు, వృక్షారోపణ, రక్తదానం, ఉచిత ఆరోగ్య పరీక్షలు ఫోటో బూత్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.