CM గారు మా ఊరికి బ్రిడ్జి కావాలి.. బ్రిడ్జి లేక అవస్థలు పడుతున్న 5 గ్రామాల ప్రజలు #localissue
Gudur, Tirupati | Sep 17, 2025 నెల్లూరు జిల్లా రాపూరు మండలం మిట్టపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించవలసినదిగా ఐదు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మిట్టపల్లి, చుట్టపాలెం, సోసం నాయున పల్లి , కృష్ణారెడ్డి పల్లి గ్రామాలకు వెళ్లాలంటే మిట్టపల్లి వాగు దాటాల్సిందే , కండలేరు వాగు లీకేజీ తో మిట్టపల్లి ఏరు నిండిపోతుందని,చిన్నపాటి వర్షానికే మోకాటి లోతు నీళ్లు నిలువ ఉండటంతో ప్రయాణికులకు, విద్యార్థుల రాకపోకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని గ్రామస్తులు వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి లోకేష్,నెల్లూరు జిల్లా కలెక్టర్ మా సమస్యను గుర్తించి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు..