జమ్మలమడుగు: మోరగుడి: గ్రామంలో వృద్ధ దంపతులను కన్న కొడుకే.. కడ తెర్చాడు - జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడిలో ఈనెల 26వ తేదీ వృద్ధ దంపతుల హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి నిందితుడు కన్న కొడుకేనని పోలీసులు తేల్చారు. బుధవారం జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు.