ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు విద్యుత్ స్తంభానికి తాడు కట్టి సాహసం చేసిన గిరిజనులు
ఎగువ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురియడంతో పొంగి ప్రవహించిన గెడ్డను దాటేందుకు పెద్ద తాడు కట్టి, దాని ఆధారంగా గిరిజనులు గెడ్డ దాటిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోని మక్కువ మండలం లో దుగ్గేరు సమీపంలో ప్రవహిస్తున్న దుగ్గేరుగెడ్డ సోమవారం మధ్యాహ్నం ఉదృతంగా ప్రవహించింది. దీంతో ఎగువ గ్రామాల గిరిజనులు గెడ్డను దాటి దుగ్గేరు వెళ్లేందుకు సాహసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గెడ్డ ఒడ్డున ఉన్న విద్యుత్ స్తంభానికి తాడును కట్టి ఆ తాడు సాయంతో గిరిజనులు గెడ్డను దాటారు. గెడ్డపై వంతెనను నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.