రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కార్యకలాపాలు నడిపించిన, హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్లను రోడ్లమీద ప్రజల మధ్యకు తీసుకువచ్చారు. సంస్కరణలో భాగంగా సత్ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్ లను ఎంపిక చేశారు. వారితో ట్రాఫిక్ విధులను నిర్వహించేలా బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప్పల్ ఎల్బీనగర్ ఈసిఐఎల్ ప్రాంతాల్లో రౌడీషీట్లతో ట్రాఫిక్ విధులను నిర్వహించేలా పోలీసు అధికారులు ప్రోత్సహించారు.