టీడీపీ ని విమర్శించిన వారికి కూడా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. ప్రజా వేదికలో శుక్రవారం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను, టీడీపీ ని విమర్శించిన వారికి సైతం సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేస్తున్నామన్నారు. తనకు అందరూ సమానులేనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.