అనంతపురం జిల్లా విడపనకల్ మండలం జనార్దనపల్లి గ్రామం వద్ద రైతు అజయ్ కుమార్ను తన పొలంలో వేసినటువంటి కంది పంటను కొయ్యటానికి వెళ్లిన వారిపై స్థానిక సర్పంచ్, టిడిపి నాయకులు అలాగే పోలీసులు అడ్డుకొని పొలంలోకి పోనివ్వకుండా చేస్తున్నారని వైస్సార్సీపీ పీ ఏ సీ సభ్యులు వై. విశ్వేశ్వర్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. భూమి హక్కు దారుడు అజయ్ కుమార్ మాజీ కురుబ, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు గోవిందు, రమణ,పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న లతో కలిసి చేనుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ హైకోర్టు, జిల్లాకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ లను కలెక్టర్కు అందజేశారు.