గుంతకల్లు: గుత్తి పట్టణానికి చెందిన జగన్నాథరెడ్డి అనే వ్యక్తి క్రిష్టపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలులో మృతి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన జగన్నాథరెడ్డి అనే వ్యక్తి పెద్ద వడుగూరు మండలంలోని క్రిష్టపాడు దగ్గర 67వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణానికి చెందిన జగన్నాథరెడ్డి అనే వ్యక్తి పని నిమిత్తం యాడికి మండలం రాయలచెరువుకు వెళ్ళాడు. బైక్ లో తిరిగి గుత్తికి వస్తుండగా క్రిష్టపాడు సమీపంలో ఆటో ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగన్నాథరెడ్డిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.