నిబంధనలు అతిక్రమిస్తే బస్సులు సీజ్
- సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు వచ్చి వెళ్లే పరిశ్రమ బస్సులు నిబంధనలను అతిక్రమిస్తే ఇకపై బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని సిఐ మురళీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ సమీపంలో ఉన్న కాలంగి బ్రిడ్జిపై నుండి పరిశ్రమ బస్సులు రాకపోకలు నిషేధం జరిగిందన్నారు. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు.