నాగనందాపురం తెలుగు గంగ కాలవలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
*తెలుగు గంగా కాలువలో గుర్తు తెలియని మృతదేహం* వరదయ్యపాళెం మండలం నాగనందాపురం గ్రామ సమీపంలోని తెలుగు గంగా కాలువలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని మగవ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 35 నుండి 45 సంవత్సరాల మధ్యగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వరదయ్యపాళెం పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వరదయ్యపాళెం ఎస్ఐకి (ఫోన్: 9440900725) సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు