ఆలేరు: అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు
Alair, Yadadri | Sep 16, 2025 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు .ఎంతమంది బాలింతలు ఉన్నారు ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు రిజిస్టర్ను తనిఖీ చేశారు రోజు పిల్లలు గర్భిణీలు బాలింతలు వస్తున్నారా వాళ్లకి భోజనం పెడుతున్నారా? పాలు గుడ్లు ఇస్తున్నారా అని తెలుసుకున్నారు ప్రతినెల దావకానకు గర్భిణీ స్త్రీలు వెళ్లి చెక్ చేసుకుంటున్నారా ? ఆశా కార్యకర్తలు రోజు సంభాషిస్తున్నారా ? అని వివరాలను అడిగి తెలుసుకున్నారు.