ప్రకాశం జిల్లాలో జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలను ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Ongole Urban, Prakasam | Nov 10, 2025
ప్రకాశం జిల్లా లో సోమవారం జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బేస్తవారిపేట మండలంలోని చెట్టిచెర్ల వద్ద ద్విచక్ర వాహనం కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక బేస్తవారిపేట పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై నడిచి వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు తో పాటు నడిచే వెళ్తున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జరిగిన ప్రమాదాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.