అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో సోమలదొడ్డి వద్ద ఆదివారం ఒకటిన్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శ్రీ అసర్ధ నారాయణస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి కమిటీ సభ్యులు అందరిచేత ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ శ్రీ అశ్వర్ధనారాయణస్వామి ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ సంజీవరెడ్డి తదితరులంతా కూడా భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి సహకరించాలని. అదేవిధంగా ఆలయం వద్ద కళ్యాణమండపం నిర్మాణం చేపట్టేందుకు కూడా త్వరలోనే నిధులు కూడా విడుదల చేయిస్తానని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.