అసిఫాబాద్: శేఖన్ గోంది గ్రామంలో దండారి సంబరాలు
ఆసిఫాబాద్ మండలం శేఖన్ గోంది గ్రామంలో దండారీ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు తిర్యాణి గుస్సాడి బృందంతో పాటు స్థానిక గుస్సాడి బృందం, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామస్థులు అతిథులకు గౌరవంగా ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.