సంచలన ఘటన చింతకుంట హత్య కేసు ముద్దాయిలను, ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలింపు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలో 2012 సంవత్సరంలో సంచలం సృష్టించిన నలుగురి హత్య కేసులో న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెల్లడించిన విషయం విధితమే, ఈ కేసుకు సంబంధించిన 12 మంది ముద్దాయిలను నంద్యాల నుంచి ఎస్కార్ట్ నడుమ ప్రత్యేక వాహనంలో ఆళ్లగడ్డ తరలించారు, అనంతరం వారిని ఆళ్లగడ్డ సబ్ జైలుకు రిమాండ్ కు తరలించారు, ఈ సందర్భంగా సబ్ జైల్ వద్ద కుటుంబ సభ్యులు రోదించారు.