కాణిపాకం స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము నందు ఈరోజు సాయంత్రం ప్రదోషకాల పూజ సందర్భంగా వైభవంగా స్వామివారి మూలవిరాట్ మరియు నందీశ్వరుడుకి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకములు, మరియు ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, అర్చకులు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.