భూపాలపల్లి: ఇటీవల ప్రమాద బారిన పడి అస్వస్థకు గురైన కార్మికులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి
భూపాలపల్లి KTK 5 ఇంక్లైన్ లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో అస్వస్థతకు గురై స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగరేణి కార్మికులు క్రాంతి కుమార్, రఘును పరామర్శించి, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.. ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి, సంబంధిత వైద్యులతో మాట్లాడారు.. వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బండారి సంపూర్ణ రవి, ముద్దసాని కిరణ్, అగుర్ల శ్రీనివాస్, అరిగే సుధాకర్, వెంకట్, రంజిత్ గౌడ్, జెట్టి కిరణ్, అనిల్, గుజ్జేటి రమేష్ తదితరులు ఉన్నారు.