అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలోని మెప్మా కార్యాలయాన్ని మెప్మా పీడీ విశ్వ జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం పీడీ కార్యాలయంలోని రికార్డులు తనిఖీ చేసి సిబ్బంది తో చర్చించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలోని సమావేశం భవనంలో పీడీ ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. తమ పరిధిలో డేటా ఎంట్రీ వంటి పనులను ఆర్పీలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మహిళా సమాఖ్య సంఘాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అదే విధంగా రుణాల లక్ష్యాలు, రికవరీ, సంఘాల రెన్యూవల్, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన పథకాలను వివరించారు.