జమ్మలమడుగు: యర్రగుంట్ల : పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో తెదేపా ఇన్చార్జి భూపేష్ రెడ్డి సమావేశం
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం యర్రగుంట్లలో మంగళవారం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పర్యటించినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన యర్రగుంట్ల టిడిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తారని తెలిపారు. పలు అంశాలపై నాయకులు, కార్యకర్తలకు సూచనలిచ్చారు.