తాడికొండ: మే 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలి: ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం, కొర్రపాడు గ్రామం నందు జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఎంపీ అభ్యర్థి శ్రీ కిలారి రోశయ్య పాల్గొన్నారు అనంతరం గ్రామంలోని ప్రతి వీదిలో ప్రచార రధంపై తిరుగుతూ ప్రతి ఒక్కరికి నమస్కారములు చేసుకుంటూ మే 13వ తేదిన జరగబోయే ఎన్నికలలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు.