జలమండలి ప్రధాన కార్యాలయం ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఫ్లకార్డులతో గేటు ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తమను ఔట్ సోర్సింగ్ నుంచి డైలీ వేజ్ లేబర్ గా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 60 ప్రకారం తమకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు