ఆర్మూర్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన వికలాంగులు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం మధ్యాహ్నం 12:30 వికలాంగులు ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా 6000 పెన్షన్ వికలాంగులకు వితంతువులకు బీడీ కార్మికులకు 4000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.