కర్నూలు: కర్నూలు లో రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి మరో యువకుడి పరిస్థితి విషమం
కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి 7 గంటలకు ముగ్గురు ప్రయాణిస్తున్న పల్సర్ బైక్ ను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరి యువకులు మృతి చెందారు మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన యువకులు కర్నూలు జిల్లా గూడూరు కు చెందిన యువకులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గూడూరు కు చెందిన చంద్రమోహన్, సుమన్ నవీన్ గా పోలీసులు గుర్తించారు