కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా పేరు పెట్టాలి పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమల రాంబాబు
కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా పేరు పెట్టాలని పిఠాపురం మాజీ ఎంపీపీ రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలోని సూర్యరాయ గ్రంథాలయంలో 'పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లా సాధన సమితి' సమావేశం జరిగింది. పిఠాపురం మహారాజా కులమతాలకు అతీతంగా విద్య, వైద్య రంగాలలో విశేష సేవలు అందించారని, అనేక సంస్థలను స్థాపించారని మన ఊరు మన బాధ్యత అధ్యక్షుడు శంకర్రావు కొనియాడారు