తాడిపత్రి: కిష్టిపాడు లోని పశు వైద్యశాలలో అగ్ని ప్రమాదం, కాలిపోయిన మందులు, ఫర్నిచర్
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు లోని పశువైద్యశాలలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో మందులు, రికార్డులు, ఫర్నిచర్ కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించిందా? లేక ఎవరైనా నిప్పు పెట్టారో తెలియడం లేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.