కరీంనగర్: ప్రస్తుత కాలంలో పిల్లలుగ్రౌండ్ కి వెళ్లి ఆడుకునే రోజులు పోయి సెల్ ఫోన్ లో ఆటలు ఆడుకునే రోజులు వచ్చాయి : ఎమ్మెల్యే గంగుల
కరాటే అనేది ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఆత్మ రక్షణకు కూడా ఉపయోగపడుతుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్ లోని రేకుర్తిలో గల ఓ ఫంక్షన్ హాల్ లో సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. విద్యార్థిని, విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటేనే మెంటల్ ఫిట్నెస్ బాగుంటుందని.. అప్పుడే చదువులో కూడ రానిస్తారన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో పుట్టిన కొద్ది సంవత్సరాలకే పిల్లల గ్రౌండ్ కెళ్ళి ఆడుకునే రోజులు పోయి.. సెల్ ఫోన్ లో ఆడుకునే రోజులు వచ్చియన్నారు.