ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో తమ పాత్రను పోషిస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారంప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి జిల్లా పోలీసు కార్యాలయం సహా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు పోలీస్ కార్యాలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసి, చెత్తను తొలగించారు. గుణపం, పారలు ఉపయోగించి పిచ్చి మొక్కలను తొలగించారు. ఇలా శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, పర్యావరణ పరిరక్షణకు తమ పాత్రను పోషించారు.