గిద్దలూరు మండలం కంచిపల్లి గ్రామంలో విష ప్రయోగం వల్లే తమ గేదలు చనిపోయాయని రైతు తెలిపాడు. శుక్రవారం ఉదయం రైతు గురవయ్య తన పశువులకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. నీళ్లు పెట్టిన అనంతరం నీటిలను తాగిన గేదెలు అనారోగ్యానికి గురయ్యాయి. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని గేదెలకు వైద్యులు చికిత్స చేస్తుండగా మూడు గేదలు చనిపోయాయి. మరొకటి తీవ్ర అనారోగ్యం బారినపడి చికిత్స పొందుతుంది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు.