చైనా మాంజా వాడకంపై పోలీసుల హెచ్చరిక గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సౌత్ వెస్ట్ డీసీపీ జి.చంద్ర మోహన్ హెచ్చరించారు. చైనా మాంజా వల్ల మనుషులు, పక్షుల ప్రాణాలతోపాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని డీసీపీ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని, ఇందులో భాగంగానే తనిఖీలు ముమ్మరం చేస్తామని డీసీపీ వెల్లడించారు.