రాయదుర్గం: మండలంలోని 55 రేషన్ దుఖానాల పరిధిలో 32 వేల స్మార్ట్ కార్డుల పంపిణీకి శ్రీకారం.. తహసీల్దార్ నాగరాజు వెల్లడి
రాయదుర్గం మండల వ్యాప్తంగా 55 రేషన్ దుఖాణాల పరిధిలో ఈ స్టార్ట్ కార్డుల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే. రాయదుర్గం మండలానికి 32 వేల కార్డులు వచ్చాయని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. వీటిని డీలర్లు, విఆర్ఓలకు ఉదయం పంపిణీ చేశారు. గ్రామాల్లో నేటి మద్యాహ్నం నుండి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు.