మనోహరాబాద్: మన తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి : మనోహరాబాద్ మండల విద్యాధికారి మల్లేశం
మన తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని మనోహరాబాద్ మండల విద్యాధికారి మల్లేశం పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం పాలాట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం ముందస్తు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మ లను పేర్చి బతుకమ్మ పాటలు పడుతూ ఆటలు ఆడారు. ప్రపంచంలోనే పువ్వులను పూజించే సంప్రదాయం తెలంగాణ లో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు కవిత, విద్యార్తులు పాల్గొన్నారు.