మేడ్చల్: ఓయూ పీజీ కాలేజీలో ఘనంగా ఆయుధ పూజ
విజయదశమి సందర్భంగా ఓయూ పీజీ కాలేజీలో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. ప్రిన్సిపల్ తలారి గంగాధర్ నేతృత్వంలో, అసిస్టెంట్ రిజిస్టర్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ దుర్గామాత అనుగ్రహం కళాశాల సిబ్బంది అందరికీ కలగాలని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.