బోథ్: బోథ్, కౌట-బి లో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజార్షి షా
Boath, Adilabad | Nov 10, 2024 సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని, ఏ ఒక్క వ్యక్తి పేరు మిస్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఎన్యూమరేటర్లను ఆదేశించారు.ఆదివారం బోథ్ మండల కేంద్రంతో పాటు, కౌటా-బి గ్రామంలో పర్యటించి సర్వేను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ఫారంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ప్రతి కుటుంబం నుంచి సేకరించి నమోదు చేయాలన్నారు.ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తదితర వివరాలను తమ వద్ద ఉంచుకొని సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.