కర్నూలు: మాజీ సైనిక భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని : గురునాథ్ డిమాండ్
మాజీ సైనికుడి కుటుంబానికి కేటాయించిన రుద్రవరం సర్వే నం.608-Hలోని 2 ఎకరాలు 30 సెంట్ల భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారంటూ రవి శంకర్ గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని గురునాథ్ డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు,ఫేక్ పట్టా, మ్యూటేషన్, ఫ్రీహోల్డ్ రద్దు చేసి భూమిని తిరిగి తమ పేరుతో నమోదు చేసి పాజెషన్ ఇవ్వాలన్నారు. అక్రమ కబ్జాకు సహకరించిన రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు డిమాండ్ చేశారు.