సత్యవేడులో రేపు మద్యం మాంసం విక్రయించరాదు, ఎస్సై రామస్వామి వెల్లడి
రేపు సత్యవేడులో మద్యం, మాంసం విక్రయించరాదు సత్యవేడు మండలంలో గురువారం మద్యం, మాంసం విక్రయాలు నిషేధమని పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ రామస్వామి స్పష్టం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని మద్యం, మాంసం విక్రయించడం చట్ట విరుద్ధమన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి మద్యం, మాంసం విక్రయ దుకాణాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. ప్రధానంగా మండలంలోని మద్యం, మాంసం, చేపల దుకాణాలు, హోటళ్లు నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.