కోడూరు : రహదారులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
రైల్వేకోడూరు:కడప నుండి తిరుపతి కి నిత్యం తిరుపతిలోని ఆసుపత్రులకు,తిరుమలకు,చెన్నైకు పలు దేవాలయాలకు,వెళ్లే ప్రధాన రహదారి అయిన ఎన్ హెచ్ఐఏ 716 ముఖ్యంగా కోడూరు నుండి రోడ్లు గుంతలమయం అయ్యి మరింత అద్వానంగా ఉండడంతో చాలామంది ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు పోయినా కూడా ఈ కుటమి ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేకుండా ఉండడంతో శుక్రవారం ముందుగా గత ప్రభుత్వం లో వేసిన రోడ్లను చూపిస్తూ అప్పటికి ఇప్పటికీ తేడా చూడండి అంటూ ఉప్పరపల్లి నుండి మాధవరంపోడు జ్యోతి నగర్ వరకు నడుచుకుంటూ వచ్చి టేపుతో కొలతలు వేసి ఒక్కో గుంత 15 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పుతో అంత పెద్ద గుంతలమైమైనా రోడ