కర్నూలు: కర్నూలు శ్రీరామనగర్‌లోని వేదాస్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని న్యాయమూర్తి తనిఖీ చేశారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి సూచనల మేరకు కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి బుధవారం శ్రీరామనగర్‌లో ఉన్న వేదాస్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యాలయ రిజిస్టర్లు పరిశీలించి, అక్కడి వసతి సౌకర్యాలు, ఆహారం, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించారు. ఒక గదిలో సీలింగ్ పెచ్చులు ఊడిపోతుండటాన్ని గమనించి, ఆ గదిలో ఎవరినీ ఉంచవద్దని, వెంటనే రిపేర్ పనులు చేపట్టాలని నిర్వాహకురాలికి సూచించారు.వసతి గృహ నిర్వాహకురాలు మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులు అందకపోవడంతో స్వచ్ఛంద సంస్థల విరాళాలతోనే ఈ వసతి గృహాన్ని నడుపుతున్నామని, తాము