పాణ్యం: రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో, మాజీ MLA కాటసాని
కల్లూరు అర్బన్ 31వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రచ్చబండ - కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజల్లో ప్రజా చైతన్యం కలిగించేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు.