చట్టపరమైన దత్తత తీసుకోవడం పిల్లలు లేని దంపతులకు శ్రేయస్కరం:జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి
Eluru Urban, Eluru | Sep 25, 2025
చట్టపరమైన దత్తత తీసుకోవడం పిల్లలు లేని దంపతులకు శ్రేయస్కరమని జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి అన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహ నందు ఆశ్రయం పొందుతున్న ఏడు నెలలు వయసు కలిగిన రామ్ చరణ్ అనే బాబును కేరింగ్స్ ద్వారా నాలుగు సంవత్సరముల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్న పిల్లలు లేని తెలంగాణ రాష్ట్రమునకు చెందిన దంపతులు సర్గం. ఆంజనేయులు మరియు గాయత్రి బాబును దంపతులకు గురువారం రాత్రి 7 గంటలకు కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా అందించారు.