రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్, అన్నమయ్య జెఏసీ నాయకులు మర్రి రవి చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి మూడవ రోజుకు చేరింది. ఇదిలా ఉంటే మర్రి రవి దీక్షకు ప్రజల నుంచి రోజు, రోజుకు మద్దతు పెరుగుతుంది. మూడవ రోజు ఊటుకూరు, నందలూరు ప్రాంతాల ప్రజలతో పాటు పట్టణానికి చెందిన పలువురు మర్రి రవి దీక్షకు సంఘీభావం తెలిపారు.