కర్నూలు: ఏపీ లో గంజాయి & మత్తు పదార్థాల రవాణాపై సీబీఐ విచారణ చేపట్టాలి – పెంచలయ్య హత్యపై ఆవేదన
నెల్లూరులో గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన ప్రజానాట్య మండలి కళాకారుడు కా. పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే గంజాయి తో పాటు ఇతర మత్తు పదార్థాల వ్యాపారాలపై సీబీఐ విచారణ జరపాలని పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జే. దివాకర్, pps నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఆందోళనలో మాట్లాడిన వారికి “మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పించిన పెంచలయ్యను పిల్లల ఎదుటే నరమేధం చేసిన దారుణంపై ప్రభుత్వం స్పందించాలి. హత్య చేసిన గంజాయి ముఠా – వారికి మద్దతు ఇచ్చిన వారిని ఎవరు అయినా కఠినంగా శిక్షించాలి” అని ఆవేదన