కరీంనగర్: భార్యతో విడాకులు కావడంతో మానసికంగా క్రుంగి పోయిన పృథ్వీరాజ్ అనే వ్యక్తి బొమ్మకల్ లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య
గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో మానసికంగా బాధపడుతూ మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ లో చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మకల్ కి చెందిన గాలి పృథ్వీరాజ్ (40) అనే వ్యక్తి తన భార్యతో విడాకులు జరిగి అదే విషయంలో మానసికంగా క్రుంగి పోయి జీవితం పై విరక్తి చెంది బుధవారం సాయంత్రం 5గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలంలోనే మృతదేహానికి పంచనామా నిర్వహించారు.