పెద్దమందడి: వెల్టురు, కొత్తకోటలో వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచన
వనపర్తి జిల్లా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెల్టురులోని జ్యోతిభాపు పులే రెసిడెన్షియల్ పాఠశాల, కొత్తకోట మండలం అమడబాకుల జూనియర్ కళాశాల వసతి గృహాన్ని కలక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లో ఆహార పదార్థాల నాణ్యత, వాటి గడువు తేది పరిశీలించడంతో పాటు స్టాక్ రిజిస్టరును పరిశీలించారు. ఆహార పదార్థాలు వచ్చినప్పుడు అవి ఎన్ని వచ్చాయి, వాటి నాణ్యత ఎలా ఉంది అనేది విద్యార్థుల కమిటీ ద్వారా పరిశీలించాలి